NTV Telugu Site icon

Sita Ramam: తెలుగు సినిమాపై ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Sita

Sita

Sita Ramam: తెలుగు సినిమా.. రోజురోజుకు తన ఖ్యాతిని ప్రపంచానికి విస్తరింపజేస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాలా అని చిన్న చూపు చూసిన వారే.. ఇప్పుడు తెలుగు సినిమా అంటే సగర్వంగా తలెత్తి ఇది తెలుగు సినిమా అని చెప్పుకొస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లేవారి నుంచి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఇక తెలుగు సినిమా సత్తాను పెంచుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్లు.. ఇటీవల సీతారామం చిత్రంతో అద్భుతమైన హిట్ ను అందుకున్నాడు హను రాఘవపూడి. అందమైన దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ హిట్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.

ఇటీవలే ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో ప్రపంచాన్ని షేక్ చేసిన ఈ దర్శకుడు.. సీతారామం చిత్రాన్ని వీక్షించి సినిమాపై తనదైన స్టైల్లో రివ్యూ చెప్పుకొచ్చాడు. ” నిన్న రాత్రి హను రాఘవపూడి సీతారామం చూసాను. దుల్కర్ నటన ఎంతో ఫ్రెష్ గా అనిపించింది. అతనిలోని నిజాయితీ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఇక మృణాల్ నటన గురించి ఏం చెప్పను.. ఆమె నటనను చూడడం ఇదే మొదటిసారి. ఎంతో ఫ్రెష్ గా, ఒరిజినల్ గా అనిపించింది. త్వరలోనే ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అవుతోంది. వావ్.. కంగ్రాట్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఒక టాలీవుడ్ సినిమాను ఇంతగా ప్రశంసించడం షాకింగ్ గా ఉన్నా.. అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.