Allantha Doorana: చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన విశ్వ కార్తికేయ ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు విశ్వ కార్తికేయ. రోల్ ఎలాంటిదైనా సరే అందులో ఒదిగిపోయి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాడు. ఇటీవల విడుదలైన ”జై సేన, కళాపోషకులు” సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రను పోషించి, ప్రేక్షకుల మన్ననలను పొందాడు. అదే జోష్ తో ఇప్పుడు మరిన్ని చిత్రాలలో చేస్తున్నాడు.
ప్రస్తుతం ‘అల్లంత దూరాన’ అనే మల్టీలాంగ్వేజ్ సినిమా చేస్తున్నాడు విశ్వ కార్తికేయ. చలపతి పువ్వాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు సురేష్ లంకపల్లి దర్శకత్వంలో ‘ఐ.పి.ఎల్.’ అనే తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అతిత్వరలో రిలీజ్ కానున్నాయి. అదే విధంగా రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘N th Hour’ మూవీలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రేక్షకులు నచ్చే, మెచ్చే కథలతో అందరి ముందుకొచ్చి కెరీర్ బిల్డ్ చేసుకుంటానని విశ్వ కార్తికేయ చెబుతున్నాడు.