Site icon NTV Telugu

MegaStar : విశ్వంభర స్పెషల్ సాంగ్.. కీరవాణిని కాదని భీమ్స్ కు భాద్యతలు

Bheems

Bheems

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నసినిమాలలో విశ్వంభర ఒకటి. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.  చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ VFX వర్క్ పట్ల మేకర్స్ సంతృప్తి గా లేకపోవడంతో కొంత రీషూట్స్ మరికొంత రీ వర్క్ చేస్తున్నారు.

Also Read : Welcome 2 : నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న అక్షయ్ కుమార్

ఈ సినిమాకు  ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర ఫస్ట్ లిరికల్ ‘ రామ రామ’ అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం కీరవాణిని కాదని మరొక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయబోతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం, ధమాకా వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో విశ్వంభరకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ మాస్ సాంగ్ ను  కంపోజ్ చేసే భాద్యతలు భీమ్స్ కు అప్పగించింది టీమ్. అందుకోసం వర్క్ కూడా స్టార్ట్ చేసాడు భీమ్స్. మిగిలిన సినిమా మొత్తం షూటింగ్ ఫినిష్ చేసారు. భీమ్స్ చేసే సాంగ్ షూట్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. మరి చిరు కోసం భీమ్స్ ఎటువంటి సాంగ్ ఇస్తాడో చూడాలి.సోషియో ఫాంటాసి కథ నేపధ్యంలో సాగే ఈ సినిమా  రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.

Exit mobile version