NTV Telugu Site icon

Vishwak Sen: కమల్ హాసన్, శివ కార్తికేయన్ బాటలో విశ్వక్ సేన్!

Vishvaksen

Vishvaksen

Vishwak Sen to do a lady getup role in his upcoming film: సుమారు ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన విశ్వక్సేన్ గామి సినిమా ఎట్టకేలకు వచ్చే శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్సేన్ అఘోరా గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద ప్రేక్షకుల సైతం అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్సేన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విశ్వక్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో విశ్వక్సేన్ తన రాబోతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ లైలా అనే సినిమా తాను చేయబోతున్నానని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే తానే రాసుకున్నానని డైరెక్షన్ కూడా తానే చేస్తున్నానని గతంలో చెప్పిన విశ్వక్ ఇప్పుడు మాత్రం దిల్ సుఖ్ నగర్ కి చెందిన ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

Vishwak Sen: ఆ సమయంలో భయమేసింది.. కానీ వాళ్ళ కోసం ఓర్చుకున్నా!

ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండ్ హాఫ్ లో తాను ఎక్కువ సేపు లేడీ గెటప్ లో ఉంటాను అనే విషయాన్ని వెల్లడించాడు. నిజానికి గతంలో కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, శివ కార్తికేయన్, మంచు మనోజ్ వంటి వారు మాత్రమే ఫుల్ లెన్త్ లేడీ గెటప్ రోల్స్ చేశారు. ఈ మధ్యకాలంలో అలాంటి ప్రయోగాలు అయితే ఏ హీరో చేయలేదు. కానీ ఇప్పుడు వారి బాటలో పయనిస్తూ విశ్వక్సేన్ లేడీ గెటప్ వేయబోతూ ఉండడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక విశ్వక్సేన్ గామీ విషయానికి వస్తే విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి, దయానంద రెడ్డి, మయాంక్ పరాక్, అభినయ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Show comments