Site icon NTV Telugu

Vishwak Sen: యాక్టింగ్ చేయకుండానే హీరో అయిన ఒకే ఒక్కడు.. సందీప్ అన్న

Reddy

Reddy

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకుల‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్‌ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి.
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా పిసిఎక్స్ ఫార్మాట్‌లో ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశాడు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ” ఏడాది పూర్తి కాకముందే మరో సినిమాతో రావడం చాలా ఆనందంగా వుంది. గామి మొదలుపెట్టినప్పుడు సరిగ్గా నా పేరుకు మీనింగ్ కూడా తెలీదు. దర్శకుడు విద్యాధర్ విజన్ ని బలంగా నమ్మాము. అన్ని సినిమాలు వేరు ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరు. చిన్న టీంతో మొదలుపెట్టి ఈ రోజు ఇంత బిగ్ స్క్రీన్ లో ట్రైలర్ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇందులో మాస్ డైలాగులు, విజల్ కొట్టే ఫైట్స్, ఐటెంసాంగ్స్ వుండవు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫీలింగ్ సెకండ్ హాఫ్ లో వుంటుంది. ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. దర్శకుడు చాలా కష్టపడ్డాడు. వంశీ గారికి ధన్యవాదాలు. ఇండియన్ ఆడియన్స్ కి యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ సందీప్ అన్న. తెలుగోళ్ళు కాలర్ ఎత్తుకునేలా చేసిన డైరెక్టర్ తను. సందీప్ అన్న ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. కార్తిక్ అండ్ క్రౌడ్ నుంచి ఫండ్ చేసిన అందరికీ చాలా చాల థాంక్స్. మార్చి 8 థియేటర్స్ కి రండి కొత్తగా ర్యాంప్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version