శుక్రవారం విడుదలైన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’కూ మంచి ఓపెనింగ్స్ రావడంతో చిన్న చిత్రాల నిర్మాతలలో కొత్త ఆశలు చిగురించాయి. దాంతో రాబోయే వీకెండ్ లోనూ సినిమాలు క్యూ కట్టేశాయి. ఇప్పటికే పూర్ణ ‘సుందరి’, సిద్ధార్థ్ ‘ఒరేయ్ బామ్మర్ధి’, ‘బ్రాందీ డైరీస్’, ‘రావేనా చెలియా’, ‘అరకులో విరాగో’ చిత్రాలు శుక్రవారం విడుదలకు సిద్దమయ్యాయి. వీటీతో పాటు శనివారం ఆర్. నారాయణమూర్తి ‘రైతన్న’ సైతం బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. తాజాగా శనివారం విశ్వక్ సేన్ మూవీ ‘పాగల్’ను ఈ నెల 14న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
శనివారం ‘పాగల్’ మూవీ రిలీజ్ డేట్‌కు అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విష్వక్ సేన్ కూల్ లుక్‌తో చేతిలో ఎర్రగులాబీని పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నాడు. వెనుక పోస్టర్‌లో మబ్బుల నుంచి లవ్ సింబల్ కనిపిస్తుంది. అంటే సినిమా ప్రేమకథా చిత్రమని పోస్టర్ తెలియజేస్తుంది. నరేశ్ కుప్పిలి దర్వకత్వంలో నిర్మాత దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పాగల్’ చిత్రంలో విశ్వక్ సేన్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఇది వరకు చేసిన చిత్రాలకు భిన్నమైన క్యారెక్టర్‌ను ‘పాగల్’ సినిమాలో చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ పాటలు, టీజర్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచాయి. ‘పాగల్’ రిలీజ్ డేట్ చాలా దగ్గరగా ఉంది. దీంతో మేకర్స్ ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను ప్లాన్ చేశారు. నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ కూడా కనిపించనున్నారు. రధన్ సంగీతాన్నిఅందిస్తోన్న’పాగల్’ చిత్రానికి ఎస్. మణికందన్ సినిమాటోగ్రాఫర్.
