యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ వేరు. మాస్ ఇమేజ్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విషయాన్నీ తాజాగా విశ్వక్ సేన్ వెల్లడించారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా విశ్వక్ సేన్ రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. ఇప్పటికే విశ్వక్ సూపర్ హిట్ చిత్రం “ఫలక్‌నుమా దాస్”కి సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫలక్‌నుమా దాస్ 2’ అని పేరు పెట్టారు. ఇక ఆయన కిట్టీలో ఉన్న మరో కొత్త ప్రాజెక్ట్ “స్టూడెంట్”.
Read Also : NTR 30 : ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన తారక్
ఈ రెండు సినిమాలూ డిఫరెంట్ జోనర్‌లో ఉంటాయని తెలుస్తోంది. “ఫలక్‌నుమా దాస్ 2” మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా, “స్టూడెంట్” న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి దర్శకులు, ఇతర సమాచారం త్వరలో వెల్లడించనున్నారు. కాగా విశ్వక్ సేన్ నటించిన “అశోక వనంలో అర్జున కళ్యాణం” చిత్రం త్వరలో విడుదల కానుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గామి’ షూటింగ్ పూర్తి కాగా, పివిపి సినిమా ఆధ్వర్యంలో తెరకెక్కిన ‘ఓరి దేవుడా’ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా విశ్వక్ సేన్ యూవీ క్రియేషన్స్‌లో “దాస్ కా దమ్కీ”ని కూడా ఇటీవలే ప్రకటించాడు.
