Site icon NTV Telugu

Ginna : జిన్నా’గా రాబోతున్న విష్ణు మంచు!

New Project (22)

New Project (22)

విష్ణు మంచు తాజా చిత్రం టైటిల్ వచ్చేసింది. ఈ టైటిల్‌ ప్రకటించేందుకు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. దీని కోసం రచయిత కోన వెంకట్, కెమెరామేన్ ఛోటా కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో భేటీ వేశాడు విష్ణు. ఈ భేటీలోనే టైటిల్ ఏమిటని కోనను విష్ణు అడగ్గా, ‘జిన్నా’ అని చెబుతాడు కోనవెంకట్. అయితే ఇది ‘గాలి నాగేశ్వరరావు’కు సంక్షిప్త రూపమంటూ దానికి తగ్గట్టుగా టైటిల్‌ అనేశాడు కోన. ‘జిన్నా’ అనగానే పాకిస్తాన్ జాతిపిత జిన్నాను తలపిపస్తుందని అన్నప్పటికీ ‘గాలి నాగేశ్వరరావు’ను షార్ట్ చేసి ఇలా ‘జిన్నా’ అని పెట్టామనగానే ఆందరూ ఏకీభవిస్తారు. ఈ ‘జిన్నా’ను తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. మురుగదాస్, శ్రీను వైట్ల వద్ద పని చేసిన ఈషాన్ సూర్య ఈ ‘జిన్నా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయనున్నారు.

Exit mobile version