Vishnu Priya: బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క షోలు చేస్తూనే ఇంకోపక్క సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్ లో నటిస్తూ బిజీగా మారింది. ఇక ఇటీవలే బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో జరీ కట్టు అంటూ ఒక ప్రైవేట్ సాంగ్ లో డ్యాన్స్ చేసి మెప్పించింది. ఇక మరోపక్క నిత్యం తన సోషల్ మీడియా అకౌంట్ లో హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె ఫేస్ బుక్ లో సడెన్ గా న్యూడ్ వీడియోలు, ఫొటోలు, అసభ్యకరమైన పోస్టులు కనిపించడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వీడియోలు ఏంటి అని విష్ణు ప్రియకు మెసేజ్ ల మీద మెసేజ్ లు పెట్టుకొస్తున్నారు.
ఇక ఈ వీడియోలపై విష్ణు ప్రియ స్పందించింది. తన ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పుకొచ్చింది. “నా ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది.. ఉదయం నుంచి నాకు చాలా మెసేజ్ లు వస్తున్నాయి. అందులో కంటెంట్ ఏంటి..? పోస్టులు ఏంటి..? అనేది నాకు అస్సలు తెలియదు. రెండు నెలలుగా రెండు సార్లు హ్యాక్ అయ్యింది. దయచేసి ఆ పేజ్ ను ఫాలో అవ్వకండి.. ఈ విషయాన్ని అందరికి చెప్పండి.. ఆ అకౌంట్ లో వల్గర్ కంటెంట్ వచ్చినందుకు నన్ను క్షమించండి. నేను చేయాల్సింది చేశాను. కానీ ఆ అకౌంట్ ను డిలీట్ చేయలేకపోతున్నాం. అందుకే ఆ పేజీని అన్ ఫాలో చేయండి”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విష్ణు ఫేస్ బుక్ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.