NTV Telugu Site icon

Vishnu Vishal: భార్యకు విష్ణు విడాకులు.. ? అసలేమైంది..?

Vishnu

Vishnu

Vishnu Vishal: చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి ప్రేమ, పెళ్లి, విడాకులు, బ్రేకప్ లు సర్వసాధారణం. ట్విట్టర్ లో కొద్దిగా ఎమోషనల్ గా స్టార్లు ఎవరైనా ట్వీట్ పెట్టడం ఆలస్యం.. ఆ హీరో.. భార్యకు విడాకులు ఇస్తున్నాడు..? ఆ ట్వీట్ అర్ధం అదే అని ఫిక్స్ అయిపోతారు. తాజాగా కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తన రెండో భార్య గుత్తా జ్వాలకు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం.. విష్ణు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో కొన్ని ఎమోషనల్ వర్డ్స్ తో కూడిన ఒక కోట్ ను షేర్ చేసుకున్నాడు. ” నేను ఎంత ప్రయత్నిస్తున్నా.. విఫలమవుతూనే వస్తున్నా.. అయినా నేను ఓడిపోలేదు. దాని నుంచో ఒక కొత్త గుణపాఠం నేర్చుకున్నాను. ఇది నాకు పరాజయం కాదు పూర్తిగా నా తప్పే. అదొక మోసం కూడిన ద్రోహం” అంటూ రాసుకొచ్చాడు. ఇంకేముంది మోసం, ద్రోహం, తప్పు అనగానే మనోడు.. తన భార్య గుత్తా జ్వాలతో గొడవపడ్డాడని, త్వరలోనే వీరు విడిపోవాలనుకుంటున్నారని పుకార్లు షికార్లు చేసాయి. ఆ పుకార్లు కాస్తా విష్ణు వద్దకు వెళ్లడంతో ఆయన మరో ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు.

Mega Power: రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘మెగా పవర్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల!

” నా ట్వీట్ ను మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను నా వ్యక్తిగత విషయాల గురించి కాదు.. రాసింది.. నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి రాశాను. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి నమ్మకం ఎక్కువ. మనం ఎదుటివారికి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ నమ్మకం మాత్రమే. ఒకవేళ ఆ నమ్మకం ఇవ్వడంలో మనం విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం. మన పట్ల మనం అంత కఠినంగా ఉండకూడదు అని చెప్పాను అంతే” అంటూ వివరణ ఇచ్చాడు. దీంతో వీరి విడాకుల రూమర్స్ కు చెక్ పడినట్లే. ఇకపోతే విష్ణు విశాల్, బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల.. 2021 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరికి ఇది రెండో పెళ్లినే కావడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం విష్ణు విశాల్.. హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.