Site icon NTV Telugu

Prabhas : కన్నప్పలో ప్రభాస్ ఎంతసేపు కనిపిస్తాడో చెప్పిన విష్ణు..

Prabhas

Prabhas

Prabhas : కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న వస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోమన్ లాల్ కీలక పాత్రల్లో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ప్రభాస్ పాత్ర గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ పాత్ర గురించి మంచు విష్ణు రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ప్రభాస్ పాత్ర కన్నప్పలో ఎంత టైమ్ ఉంటుందో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

Read Also : Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాకిచ్చిన కోర్టు..!

‘ఈ సినిమాలో ప్రభాస్ ను అతిథి పాత్ర కోసం తీసుకోవాలని ముందుగా అనుకున్నాం. కానీ తర్వాత 30 నిముషాల వరకు ప్రభాస్ పాత్రను పెంచేశాం. చివరి 50 నిముషాలు ప్రభాస్ ను ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఈ పాత్ర ప్రభాస్ లైఫ్‌ లో ది బెస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పాత్ర అద్భుతంగా వచ్చింది.

ప్రభాస్ హైట్, ఫేస్ కట్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాం. ప్రభాస్ కు మా నాన్న మోహన్ బాబుకు మధ్య వచ్చే సీన్లు అద్భుతంగా ఉంటాయి. ఇందులో మోహన్‌లాల్‌ పాత్ర 15 నిమిషాలు, అక్షయ్‌ కుమార్‌ 10 నిమిషాలు కనిపిస్తారు. సినిమా మొత్తం3 గంటల 10 నిమిషాలు ఉంటుంది. ప్రభాస్ పాత్ర మూవీపై మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది’ అంటూ చెప్పారు విష్ణు.

Read Also : Odisha: ఒడిశాలో బోటు బోల్తా.. సౌరవ్ గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ముప్పు

Exit mobile version