NTV Telugu Site icon

Vishnu Priya: నా జీవితం మొత్తం ఖరాబ్ అయినా కూడా ఆ పని చేస్తున్నా..

Vishnu

Vishnu

Vishnu Priya: రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన నెంబర్ 1 యారి అనే షోలో రానాకు సపోర్ట్ చేసే అమ్మాయిగా విష్ణుప్రియ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత పోవే పోరా అనే షోలో సుధీర్ సరసన యాంకర్ గా మారి ఫేమస్ అయ్యింది. ఈ షో అమ్మడి జీవితాన్నే మార్చేసింది. ఇక అలా ఈటీవీలో జరిగే ప్రతి ప్రోగ్రామ్ లో విష్ణుప్రియ పాల్గొంటూ తనకంటూ ఒక గుర్తింపు ను తెచ్చుకుంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తూ వస్తుంది. ఇక ఈ మధ్యనే దయ అనే వెబ్ సిరీస్ లో జర్నలిస్ట్ గా కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ గత కొన్ని రోజులనుంచి సోషల్ మీడియాలో కనిపించడం మానేసింది. ఒకప్పుడు వెకేషన్స్ అని, యాడ్ షూట్స్, ఫోటో షూట్స్ అని బిజీ బిజీగా తిరిగే విష్ణుప్రియ.. ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. అవకాశాలు లేకనో.. లేక కొద్దిగా గ్యాప్ తీసుకుందోతెలియదు కానీ, ప్రస్తుతం అమ్మడి జీవితం ఖరాబ్ అయ్యిందని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.

Madonna Sebastian: అరేయ్.. ఆంటోనీ దాస్.. ఎలారా.. ఇంత అందాన్ని నరబలి ఇచ్చావ్

తాజాగా విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అదే రాసుకొచ్చింది. ” ప్రస్తుతం నా పరిస్థితి.. మెంటల్ హెల్త్ ఖరాబ్, ఫిజికల్ హెల్త్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్, రిలేషన్ ఖరాబ్, షెడ్యూల్ ఖరాబ్.. అయినా కూడా నేను ఛిల్ల్ అవుతున్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే విష్ణుప్రియ చెప్పిందని ప్రకారం.. ఆమె హెల్త్ కు ఏమైంది.. ? ఎవరితో రిలేషన్ ఖరాబ్ అయ్యింది.. ? అని కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మరి ఈ పాప.. ప్రాస కోసం ఆ లైన్స్ పెట్టిందా.. ? లేక నిజంగానే ఏదైనా జరిగిందా.. ? అనేది తెలియాల్సి ఉంది.