Manchu Vishnu : విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీ రేపు జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒక రోజు ముందు వరకూ ఆయన ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. తాజా ప్రమోషన్లలో ఈ మూవీని పవన్ కల్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా ఆయనకు చూపిస్తా. ఇప్పుడు పవన్ కల్యాణ్ గారు మనం అనుకున్నట్టు లేరు. ఆయన మీద ఒక రాష్ట్రం బాధ్యత ఉంది. చాలా పెద్ద పొజీషన్ లో ఉన్నారు.
Read Also : Dhanush : ధనుష్ లాంటి పాత్రలు టాలీవుడ్ లో చేసేది ఆ ఒక్కడే..!
కాబట్టి ఆయన టైమ్ తీసుకుని నా మూవీని చూపిస్తా. కచ్చితంగా ఆయనకు నచ్చుతుంది. ఆయన నుంచి వచ్చే ప్రశంసల కోసం వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. ఇక ప్రభాస్ ను మూవీ ప్రమోషన్లకు ఎందుకు తీసుకురాలేదో కూడా చెప్పాడు. ప్రభాస్ చాలా మొహమాట పడే వ్యక్తి. అతను నా సినిమాలో నటించడమే నాకు గొప్ప. అతన్ని నేను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే తీసుకురావట్లేదు అని చెప్పుకొచ్చాడు. మూవీ టికెట్లు భారీగా అమ్ముడు పోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు విష్ణు.
Read Also : Pawankalyan : పవన్ కల్యాణ్ మిస్ చేసుకున్న రెండు భారీ సినిమాలు ఇవే..
