Site icon NTV Telugu

Vishal: పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఓటు మాత్రం అతనికే వేస్తాను

Vishal

Vishal

Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం లాఠీ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్ తో పాటు అన్ని భాషల్లో డిసెంబర్ 22 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు వినోత్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మోహన్ బాబు చీఫ్ గెస్ట్ గా రావడంతో అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పెంచిన విశాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని కానీ పవన్ కు ఓటు వేయను అని చెప్పి షాక్ ఇచ్చాడు.

“పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సినిమాల్లోకి రాకముందు నుంచి నాకు తెలుసు. మా నాన్నగారు, చిరంజీవితో కలిసి ఎస్పీ పరుశురాం సినిమా చేసినప్పుడే నేను పవన్ ను చూశాను. ఆ తరువాత ఆయనకున్న క్రేజ్, ఆ యూనిక్ స్టైల్, థియేటర్ లో ఆయన సినిమాకు చూస్తే ఒక పండుగల ఉంటుంది. ఇక జగన్ గురించి చెప్పాలంటే రాజకీయపరంగా జగన్ అంటే నాకు చాలా ఇష్టం. సీరియస్ గానే చెప్తున్నా.. రాజీకీయాల పరంగా ఎవరి పక్షాన ఉండాలంటే నేను జగన్ కే ఓటు వేస్తాను. పాలిటిక్స్ వచ్చి సినిమా కాదు.. సినిమా వచ్చి ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ వేరే.. పాలిటిక్స్ వచ్చి సమాజసేవ.. సమాజానికి సేవ చేసే ప్లాట్ ఫార్మ్ ఇది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version