ఈ నెల ప్రారంభంలో విడుదలైన ‘వీరమే వాగై సూదుం’లో చివరిగా కనిపించిన కోలీవుడ్ స్టార్ విశాల్ తన నెక్స్ట్ మూవీ ‘లత్తి’ షూటింగ్‌లో ఉన్నారు. వినోద్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ అండ్ నందా ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించగా, ఎం బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. విశాల్ హైదరాబాద్‌లో ఈ చిత్రం మూడవ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో ‘లత్తి’ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అందులో భాగంగానే ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేసిన కొన్ని హై ఆక్టేన్ స్టంట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు విశాల్ గాయపడినట్లు తెలుస్తోంది.
Read Also : Statue of Equality : సమతామూర్తి సన్నిధిలో అల్లు అర్జున్
విశాల్ తన చేతితో పాటు పలుమార్లు తలకు తగిలిన గాయాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ గాయాల నుంచి కోలుకోవడానికి విశాల్ ఇప్పుడు కేరళకు బయలుదేరినట్లు సమాచారం. విశాల్ కు గాయాలు కావడంతో ‘లత్తి’ షూటింగ్ కు బ్రేక్ పడింది. మార్చిలో షూటింగ్ చివరి షెడ్యూల్ కోసం విశాల్ టీంతో జాయిన్ కానున్నాడు. విశాల్ తాను గాయాల పాలైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “లత్తిలో ఈ స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో అనేక హెయిర్ లైన్ ఫ్రాక్చర్లకు గురయ్యాను. నన్ను నేను పునరుద్ధరించుకోవడానికి కేరళకు బయలుదేరాను! మార్చి మొదటి వారం 2022 నుండి చివరి షెడ్యూల్ కోసం షూటింగ్ లో జాయిన్ అవుతాను” అంటూ ట్వీట్ చేశారు.