Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు మూలాలు ఉన్న ఈ హీరో తమిళ్ లో ఎక్కువ హిట్స్ అందుకోవడంతో అక్కడే స్థిరపడిపోయాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి ఆయన సినిమాలను ఆయనే నిర్మిస్తున్నాడు. ఇక పొలిటికల్ గా కూడా విశాల్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. నడిగర్ సంఘానికి బిల్డింగ్ కట్టేవరకు పెళ్లి చేసుకోను అని శపథం చేసిన విశాల్.. అనుకున్నట్టుగానే నడిగర్ బిల్డింగ్ ను నిర్మించాడు. ఇక వీటిల్లోనే కాకుండా ట్విట్టర్ లో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు విశాల్. గత కొన్నిరోజులు గా సోషల్ మీడియాలో విశాల్ పేరు మారుమ్రోగిపోతుంది. అందుకు కారణం.. అవార్డుల గురించి విశాల్ చేసిన సంచలన వ్యాఖ్యలే. అవార్డులతో తనకు పని లేదని, ప్రేక్షకుల నుంచి వచ్చే మంచి మాటలే తనకు అవార్డులు అని.. తనకు అవార్డులు వస్తే చెత్తబుట్టలో వేస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ మాటలే ఇంకా కోలీవుడ్ ను కుదిపేస్తుంటే.. ఈసారి నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసి మరింత హాట్ టాపిక్ గా మారాడు.
తాజాగా విశాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను నిర్మాతగా ఎందుకు మారాల్సివచ్చిందో చెప్పుకొచ్చాడు. కొంతమంది నిర్మాతలు తనను ఎలా ఇబ్బంది పెట్టారో తెలిపాడు.. ” కొంత మంది నిర్మాతల వ్యవహారశైలి వల్ల సినీ పరిశ్రమకు నష్టం జరుగుతుంది. నేను ఎన్నోసార్లు ఆలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఒక సినిమా తీసి.. ప్రమోషన్స్ చేసి.. శుక్రవారం రిలీజ్ అనగా .. గురువారం రాత్రి నిర్మాతలు సినిమాను ఆపేస్తున్నామని బెదిరించేవారు. ఫైనాన్షియర్స్ కు ఇంకా డబ్బులు కట్టలేదని, సినిమా రిలీజ్ కాదని బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర డబ్బులు గుంజేవారు. ఇంకొంతమంది అయితే సరిగ్గా పారితోషికం కూడా ఇచ్చేవారు కాదు. ఇవన్నీ తట్టుకోలేకనే నేను నిర్మాతగా మారాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. విశాల్ ను అంతలా ఇబ్బందిపెట్టిన నిర్మాతలు ఎవరు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం విశాల్ నటించిన మార్క్ ఆంటోని సెప్టెంబర్ 15 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.