Site icon NTV Telugu

సంక్రాంతి బరిలోకి దూసుకొస్తున్న ‘సామాన్యుడు’

vishal

vishal

ఈ ఏడాది సంక్రాంతి చిన్న సినిమాలతో సందడి చేయనుంది. పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో భారీ రిలీఫ్ పొందిన చిన్న సినిమాలు ఇక తమ సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశాయి. ఇక తాజాగా ఈ సంక్రాంతి రేసులోకి యంగ్ హీరో విశాల్ కూడా ఎంటర్ అయ్యాడు. తు.ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన డింపుల్ హయతి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

https://ntvtelugu.com/debate-on-devi-sri-prasad-marriage-rumours-in-pushpa-party/

ఇక ముంచు నుంచి ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తూ వచ్చారు. అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో సామాన్యుడు ని కూడా సంక్రాంతి రేసులో దించాలని చూస్తున్నాడు విశాల్. ఈ మేరకు జనవరి 14 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు విశాల్ కొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. పదవి, అధికారం కోసం సామాన్యులను అంతం చేయడానికి చూస్తున్న రాజకీయ నాయకులను ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంపై తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి హిట్ ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version