Site icon NTV Telugu

Vishal: ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పను కానీ!!.. హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

Vishal

Vishal

Vishal Comments at Rathnam Movie Press meet: రత్నం సినిమా ప్రెస్ మీట్ లో హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరి డైరెక్షన్లో విశాల్ రత్నం అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో విశాల్ మాట్లాడుతూ దయచేసి మే 13న కొత్త ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలని, తమిళనాడులో నా ఓటు నేను వేశానని అన్నారు. తమిళనాడులో 70 శాతం ఓటింగ్ నమోదైంది, ఇంకో 20 శాతం పోలైతే విప్లవాత్మకమయ్యేదని అన్నారు. తమిళనాడులో ఓటింగ్ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని, శుక్రవారం కాకపోతే మరో శుక్రవారం సినిమా చూడొచ్చు కానీ ఓటు మాత్రం ఒక రోజు మాత్రమే వేయగలం అని అన్నారు. ఐదు సంవత్సరాలకోసారి ఓటర్లు తమ బాధ్యత నెరవేర్చుకోవాలని, నమ్మిన వాళ్లకు ఓటు వేయండి, ఓటు వేయించుకున్న వాళ్లు చేయాల్సిన బాధ్యత చేయాలని అన్నారు.

Ram Charan: గేమ్ చేంజర్ లో మరో రికార్డ్ బ్రేకింగ్ ఫైట్.. కాస్కోండి!

నేను ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఓటు వేయమని చెప్పను, ఎవరిని కించపరిచేలా మాట్లడటం నాకు ఇష్టం ఉండదు, నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంటానని అన్నారు. తమిళనాడులో ఇంకో జెండా, ఇంకో నాయకుడు రాకూడదనుకుంటా, రాజకీయ నాయకులు వాళ్ల పని సరిగ్గా చేస్తే మరో పార్టీ , ఇంకో నాయకుడు పుట్టడని అన్నారు. రాజకీయ నాయకులు నటులుగా మారుతుంటే నటులు రాజకీయ నాయకులవుతున్నారని అన్నారు. నా దృష్టిలో రాజకీయం అనేది సమాజ సేవ, నేను అమ్మ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నానని అన్నారు. మా స్వచ్చంద సంస్థ ద్వారా తెలియని వ్యక్తులకు సాయం చేయడం మా ఏజెండా, రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేయడం ఎజెండాగా ఉండాలని అన్నారు. ప్రజలు బెంజ్ కార్ అడుగుతారా? బంజారాహిల్స్ లో ఇళ్లు అడుగుతున్నారా ? తాగడానికి మంచినీళ్లు, విద్య, వైద్యం, బతకాలని ప్రజలు అడుగుతారని అన్నారు. నేను ఇప్పుడు ఒక ఓటరును మాత్రమే, నేను ఏ రాజకీయ నాయకుడితో కలిసి పనిచేయను, ఏ పార్టీలో కలిసిపోనని అన్నారు.

Exit mobile version