Site icon NTV Telugu

Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. అసలు విషయం ఓపెన్ అయిన విశాల్

Vishal

Vishal

Vishal Clarity on New York Video:కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ వీడియోతో విశాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కినట్టు అయింది. 46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్న విశాల్ ప్రేమ వ్యవహారాలు ఒకప్పుడు కోలీవుడ్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. ఇప్పటికే ఈ హీరోకి రెండుసార్లు పెళ్లి ఫిక్స్ అయి పలు కారణాలతో ఆగి పోయింది. అయితే ఎవరో ఏమో తెలియదు కానీ విశాల్ తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. న్యూయార్క్ లో అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై నడుస్తూ కనిపించాడు, అయితే అక్కడ కొందరు గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే కెమెరా కనిపించగానే షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకుని అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు.

Bigg Boss Telugu : ఇకపై అవి రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు..?

ఆ అమ్మాయి ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఎవరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఏమో అని ప్రచారం కూడా మొదలైన క్రమంలో దీనిపై విశాల్ స్పందించాడు. క్షమించండి అబ్బాయిలు, ఇటీవలి వీడియో గురించి నిజాన్ని వెల్లడించడానికి ఇది సమయం అని నేను అనుకుంటున్నా, లొకేషన్ పరంగా ఇది సగం నిజం అని అన్నారు. అవును నేను న్యూయార్క్‌లో ఉన్నా, ఇది నా కజిన్స్‌తో నేను రెగ్యులర్ గా చిల్ అయ్యే ప్లేస్. మా బంధువులందరూ క్రిస్మస్ రోజున చిలిపి పని చేయాలని నిర్ణయించుకున్నాం. నా కజిన్స్ ఒక ప్రాంక్ కి స్వయంగా దర్శకత్వం వహించి, అమలు చేసి అమలు చేశారు అంటూ అసలు విషయం ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఇది ప్రాంక్ అని తేల్చేశాడు.

Exit mobile version