కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ ఈ ఆగష్టు 29న తన 44 వ పుట్టినరోజును జరుపుకున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాల అప్డేట్స్ తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన తన కొత్త చిత్రం ‘సామాన్యుడు’ ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేశారు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ శరవేగంగా జరుగుతోంది. విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కుతోంది. హీరో ఆర్య కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ చిత్రం ‘ఎనిమీ’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
Read Also : “నో కామెంట్స్”… రూమర్స్ పై సమంత రియాక్షన్
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో తన బర్త్ డేను మరింత ప్రత్యేకంగా జరుపుకున్నారు. విశాల్ దేవీ ట్రస్ట్ ద్వారా తన దాతృత్వ కార్యకలాపాలను, సామాజిక సేవ చేస్తుంటాడు. ఆయన పుట్టినరోజున కూడా చెన్నైలోని మెర్సీ హోమ్‌ని సందర్శించి, అక్కడ ఉన్న వృద్ధులకు ఆహారం అందించడం ద్వారా తన పుట్టినరోజును మరింత గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. ఆ తరువాత విశాల్ సురభి అనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. వాళ్ళతో కలిసి అక్కడే భోజనం కూడా చేశారు. ఇదంతా జరిగి రెండ్రోజులు కావొస్తున్నా సోషల్ మీడియాలో విశాల్ చేసిన మంచిపనికి ప్రశంసలు కురిపిస్తూ.. నెటిజన్లు ఆ ఫోటోలను, వీడియోలను ఈ రోజుకూ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Overwhelming happiness that anyone could get on their birthday is only through serving the people in need.
— Vishal (@VishalKOfficial) August 30, 2021
“A Day Well Spent❤️”https://t.co/T6FHzdefUR#Birthday #Happiness pic.twitter.com/tAv76T1onl
A Day Spent Well !!! pic.twitter.com/WzIsz162hW
— Vishal (@VishalKOfficial) August 29, 2021