Virushka: ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం మీద సెలబ్రిటీలతో పాటు అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ విరాట్ అనే చెప్పాలి. ఇక విరాట్.. ఒకపక్క మ్యాచ్ లు .. ఇంకోపక్క యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక విరాట్ భార్య అనుష్క శర్మ గురించి పరిచయమే అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ గా మెరిసిన ఈ భామ.. 2017 లో విరాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి వామిక అనే కూతురు ఉంది. ఇక వామిక పుట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు మీడియాకు ఆమె ఫోటోను చూపించిందే లేదు. ఎంతోమంది.. ఎన్నో విధాలుగా వామిక ఫోటోను సంపాదించాలని ట్రై చేశారు. కానీ, కూతురు ప్రైవసీ విషయంలో మాత్రం ఆ విరుష్క అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. వామిక ఫోటోను ఎప్పుడు రిలీజ్ చేయాలో.. ఆమెను కెమెరా ముందుకు ఎప్పుడు తీసుకురావాలో తమకు తెలుసు అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు కూడా ఆ సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
Shriya Saran : బీచ్ లో హాట్ లుక్ తో రచ్చ చేసిన శ్రీయా శరణ్..
ఏదైనా పండగ కానీ, స్పెషల్ అకేషన్ కానీ వచ్చిన ప్రతిసారి వామికను చూపిస్తారని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నా.. విరుష్క మాత్రం కూతురు ముఖాన్ని మాత్రం చూపించింది లేదు. ఇక నిన్న వినాయక చవితి.. విరుష్క తమ ఇంట్లో ఎంతో అద్భుతంగా వినాయక పూజ చేసినట్లు తెలుపుతూ.. ఒక ఫోటోను చేశారు. సాంప్రదాయమైన దుస్తుల్లో విరుష్క ఎంతో అందంగా కనిపించారు. విరాట్.. వైట్ అండ్ వైట్ ఫైజామాలో కనిపించగా .. అనుష్క కంచిపట్టు చీరలో అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించింది. ఇద్దరు ఎంతో అందంగా ఉన్నారు. అయినా వామిక లేదనే బాధ మాత్రం అభిమానుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఫోటో కింద ప్రతి ఒక్కరు కూడా పండగ పూట కూడా వామికను చూపించరా.. అన్యాయం ఇది..? అంటూ కామెంట్స్ పెట్టడం విశేషం. మరి ఆ చిన్నారి ఎప్పుడు అభిమానుల ముందుకు వస్తుందో చూడాలి.