NTV Telugu Site icon

Virupaksha: ఊపిరి కూడా ఆడని ప్రదేశంలో షూటింగ్…

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో, సుకుమార్ అండ్ SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్, వరల్డ్ ఆఫ్ విరూపాక్షని ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు. గతంలో మోధమాంబ టెంపుల్ విలేజ్ విశేషాలతో ఒక వీడియో రిలీజ్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా ‘అఘోర గుహ’లకి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. రుద్రవనం అనే ఊరిని సెట్ వేసిన చిత్ర యూనిట్, అదే ఊరి బ్యాక్ డ్రాప్ లో ‘అఘోర గుహ’లని కూడా సెట్ వేశారు.

Read Also: Mahesh Babu: #SSMB28 షూటింగ్ బ్రేక్… సంక్రాంతి వరకూ టైం ఉంది కదా…

మిస్టరీ అప్పీరెన్స్ ఇస్తూ వేసిన ఈ సెట్, విరూపాక్ష సినిమాకి థ్రిల్లర్ కలర్ తెచ్చింది. ఈ వీడియోని రిలీజ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్, వారం రోజుల పాటు ఊపిరి కూడా ఆడనంత పొగలో షూట్ చేసాం అని ట్వీట్ చేశాడు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ మూవీలో ఇలాంటి కొత్త ఎలిమెంట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? అవి ఎలా ఉండబోతున్నాయి? అసలు విరూపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Show comments