సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే ట్యాగ్ నుంచి డైరెక్టర్ గా మారాడు కార్తీక్ దండు. ఏప్రిల్ 21న రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ విరుపాక్ష సినిమాతో కార్తీక్ దండు సూపర్ హిట్ కొట్టాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ రాబడుతోంది. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది అంటే విరుపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్ సమ్మర్ సీజన్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చిన విరుపాక్ష మూవీని కార్తీక్ దండు బాగా రాసుకోని, అంతే బాగా తెరకెక్కించాడు అనే కామెంట్స్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. విరుపాక్ష ఒక డైరెక్టర్స్ ఫిల్మ్ అనే కామెంట్స్ వినిపిస్తుండడంతో సుకుమార్ శిష్యుడికి ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట. అయితే అందరూ అనుకుంటున్నట్లు కార్తీక్ దండుకి విరుపాక్ష మొదటి సినిమా కాదు, ఇది అతని రెండో సినిమా. ఎనిమిదేళ్ల క్రితమే దర్శకుడిగా మొదటి సినిమా చేసిన కార్తీక్ దండు, 2015లో ‘భం భోలేనాథ్’ అనే సినిమా చేశాడు.
నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా నటించిన ఈ కామెడీ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. అప్పటినుంచి సుకుమార్ క్యాంప్ లో ట్రావెల్ అవుతూ వచ్చిన కార్తీక్ దండు, థ్రిల్లర్ కథతో విరుపాక్ష సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టాడు. డైరెక్టర్ అవ్వడం కన్నా ముందు రైటర్ గా మారిన కార్తీక్ దండు, 2014లో వచ్చిన నిఖిల్ ‘కార్తికేయ’ సినిమాకి మూల కథని అందించాడట. కార్తికేయ సినిమా కూడా ఒక గుడి చుట్టూ అల్లిన థ్రిల్లర్ కావడం విశేషం. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిఖిల్ ని హీరోగా నిలబెట్టింది. ఎట్టకేలకు మొదటి సినిమా చేసిన ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మూవీ చేసి హిట్ కొట్టడం అంటే మాటలు కాదు. వేరే ఎవరైనా అయితే మొదటి సినిమా ఫ్లాప్ అవ్వగానే ఇక మనకి ఇండస్ట్రీలో అవకాశాలు రావనే అర్ధం చేసుకోని ఈ ఎనిమిదేళ్లలో ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయే వాళ్లేమో. అలా వెళ్లకుండా ఇక్కడే ఉంటూ వచ్చాడు కాబట్టే ఈరోజు కార్తీక్ దండు ఖాతాలో విరుపాక్ష లాంటి సాలిడ్ హిట్ పడింది. మరి ఈ యంగ్ డైరెక్టర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? ఎవరితో ఉంటాయి అనేది చూడాలి.