ప్రేమ, ఆప్యాయత, అనురాగాల గూర్చి ఎక్కువగా పట్టించుకోని రాంగోపాల్ వర్మ.. తాజాగా తన మొదటి ప్రేమను పరిచయం చేస్తూ ఆమె ఫొటోతో సహా షేర్ చేశాడు. ‘కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు పోలవరపు సత్య, మెడిసిన్ చేసింది. మా క్యాంపస్ పక్కనే, ఆమె మెడికల్ క్యాంపస్ ఉండేది. ప్రతిరోజు ఆమె చూస్తూ.. ప్రేమలో పడిపోయాను. కానీ, ఆమె డబ్బున్న మరో వ్యక్తి ప్రేమలో ఉందన్న భ్రమలో నేను ఉన్నాడు. అందుకే వన్ సైడ్ ప్రేమికుడిగా ఉండిపోయాను. రంగీలా కథ పుట్టడానికి కూడా ఇదో కారణం.. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో డాక్టర్ గా రాణిస్తుంది’ అంటూ వర్మ పేర్కొన్నారు. అయితే ఆ కాలేజీ రోజుల్లోనే వర్మ, దివంగత నటి శ్రీదేవిని కూడా ఆరాధించిన విషయం తెలిసిందే.