Site icon NTV Telugu

వైరల్ పిక్స్: మందు గ్లాస్ తో భూమిక

టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన భూమిక చావ్లా… స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడే యోగా టీచర్‌ భ‌ర‌త్ ఠాకూర్‌ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల ఈ సీనియర్‌ నటి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. నచ్చిన సినిమాల్లో అప్పుడప్పుడు కీలక పాత్రల్లో తళుక్కుమంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

అయితే, తాజాగా ఈబ్యూటీ చేతిలో మందు గ్లాసుతో కనిపించి అందరికి షాకిచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేశానంటూ మందు తాగుతున్న ఫోటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే అభిమానులు అది ఏ బ్రాండో చెప్పండంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version