NTV Telugu Site icon

Kamal- Rajini: సూపర్ స్టార్ ను విశ్వనటుడు కలిసిన వేళా..

Kamal

Kamal

టాలీవుడ్ లో స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అని చెప్పుకొచ్చేస్తాం .. అదే కోలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరు అంటే టక్కున కమల్ హాసన్, రజినీకాంత్ అని చెప్పుకొచ్చేస్తారు. కష్టపడి పైకి ఎదిగిన వారి వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. వారిద్దరూ తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే.. ఇక ఒకప్పుడు ఆ స్టార్లు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ఇక చాలా రోజుల తరువాత ఈ స్టార్లు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి మెప్పించారు. ఇటీవలే కమల్ హాసన్, రజినీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం కమల్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సీబీనిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ నేపథ్యంలోనే కమల్, రజినీ ఇంటికి వెళ్లి మరీ కలవడం విశేషంగా మారింది. కమల్ తో పాటు రజినీని లోకేష్ కనగరాజ్ ను కూడా కలిశారు. కమల్ – రజినీ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. విక్రమ్ సినిమా గురించి లోకేష్, రజినీకి చెప్పినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ రజినీ కి ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎన్నో ఏళ్ళ తరువాత ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే కమల్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్న విషయం విదితమే.. ఇక రజినీ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రావాల్సిన సమయానికి వస్తాను అని చెప్పిన ఆయన ఈ మీటింగ్ లో రాజకీయంగా కూడా పలు విషయాలు చర్చించినట్లు సమాచారం. మరి ముందు ముందు రజినీ పాలిటిక్స్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.