Site icon NTV Telugu

Pawan Kalyan: ఆ రీమేక్‌కి 20 రోజుల డేట్స్.. సెట్స్ మీదకి అప్పుడే?

Vinodhaya Sitham Remake Date

Vinodhaya Sitham Remake Date

తమిళంలో మంచి విజయం సాధించిన ‘వినోదయం సీతమ్’ను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే! ఒరిజినల్‌కి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ప్రధాన పాత్రలో నటించిన సముద్రఖని ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు పవన్ 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత రాలేదు. అదిగో, ఇదిగో అంటూ.. యూనిట్ సభ్యులు చెప్పడమే తప్ప, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. నిజానికి.. భీమ్లా నాయక్ రిలీజైన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన పనులు కూడా చకచకా నడుస్తున్నాయని, త్రివిక్రమ్ మాటలతో పాటు స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అంటే, ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్స్ రాలేదు.

ఇప్పుడు తాజాగా వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌కి ముహూర్తం ఖరారు చేశారట! జులై నుంచే ‘వినోదయ సీతమ్’ రీమేక్‌ను పట్టాలెక్కించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికార ప్రకటన కూడా రానుందట! స్క్రిప్ట్ వర్క్ దాదాపు తుది దశకు చేరుకోవడం, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా చకచకా ముగియడంతో.. ఇక సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట! ఈ చిత్రానికి పవన్ 18-20 రోజుల డేట్స్ కేటాయించాడని, అతనికి సంబంధించిన పోర్షన్ ఆ వ్యవధిలోనే ముగించనున్నారని తెలిసింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కృతి శెట్టి, శ్రీలీలాలను కథానాయిక పాత్ర కోసం పరిశీలిస్తున్నారని.. ఇద్దరిలో ఎవరో ఒకర్ని త్వరలోనే ఫైనల్ చేయనున్నారని తెలిసింది. వీలైనంత త్వరగా ముగించి, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తు్న్నారు.

Exit mobile version