Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్‌పై మరో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinayakan: తెరపై విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టిన నటుడు ఇప్పుడు నిజ జీవితంలోనూ తీవ్ర వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో విలన్ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు వినాయకన్‌పై కేరళ పోలీసులు బుధవారం మరో కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల చిన్నారి ఫోటో, ఆమె తండ్రి మొబైల్ నంబర్‌ను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ ఘటన ఇప్పుడు కేరళలోనే పెద్ద చర్చకే దారితీస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటనకు కారణమైన సంఘటన 2025 జూలై 23న ప్రారంభమైంది. ఆ రోజు రాత్రి వినాయకన్కు వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో వచ్చిన ఒక పోస్టును బాధితుడు ఫార్వర్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మెసేజ్ చూసిన వినాయకన్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున బాధితుడి వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో పాటు అతని మొబైల్ నంబర్ స్క్రీన్‌షాట్ తీసి, తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రొఫైల్ ఫోటోలో బాధితుడితో పాటు అతని ఎనిమిదేళ్ల కుమార్తె కూడా కనిపించడం వివాదానికి కారణమైంది.
వినాయకన్ సోషల్ మీడియా ఖాతాకు భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉండటంతో ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు ఆ పోస్టును షేర్ చేస్తూ బాధితుడి కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో కనిపించిన ఫోన్ నంబర్ నటుడు వినాయకన్దేనని భావించిన అనేక మంది బాధితుడికే ఫోన్ చేసి దూషించారని సమాచారం. ఈ కారణంగా తన కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైందని, చిన్నారి కూడా భయాందోళనలకు లోనైందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బాధితుడి తండ్రి కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం మావేలిక్కర పోలీసులు వినాయకన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరువు నష్టం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం వంటి సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, కేరళ పోలీస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే వినాయకన్ వాంగ్మూలాన్ని నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
- Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
- Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక... త్వరలోనే గుడ్ న్యూస్
- Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు... 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
వినాయకన్కు వివాదాలు కొత్తకాదు. గతంలోనూ మద్యం మత్తులో ప్రవర్తించిన తీరుపై పలుమార్లు వార్తల్లో నిలిచారు. 2025లో కేరళలోని ఓ హోటల్లో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అంతకుముందు 2024లో కొచ్చి విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో ఘర్షణకు దిగిన ఘటన కూడా పెద్ద చర్చకు దారితీసింది. పొరుగువారితో గొడవపడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నటుడిగా వినాయకన్కు మంచి గుర్తింపు ఉంది. 2016లో విడుదలైన ‘కమ్మట్టిపాడం’ చిత్రంలో నటనకు ఆయన కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇటీవల ‘జైలర్’, ‘మార్కో’ చిత్రాల్లోనూ ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. అయినప్పటికీ తరచూ వివాదాల్లో చిక్కుకోవడం ఆయన సినీ ప్రయాణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు నమోదైన తాజా కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది కేరళలో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్‌పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్‌లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్‌లో ఆ ప్లేయర్‌తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!