Site icon NTV Telugu

Vinay Rai: హనుమాన్ నటుడితో లివింగ్ రిలేషన్లో ముదురు హీరోయిన్..ఇట్స్ అఫీషియల్

Vimala Raman

Vimala Raman

Vimala Raman confirms her live-in partner Vinay Rai: తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమాతో హీరోయిన్ విమలా రామన్. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన ఆమె ఒక తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. తర్వాత మలయాళం లో ఎన్నో సినిమాలు చేసి మలయాళ భామగా అందరి దృష్టిని ఆకర్షించి తెలుగులో వరుస సినిమాలు చేసింది. నిజానికి ఆమె తెలుగులో చాలా సినిమాలు చేసింది కానీ సరైన గుర్తింపు దక్కలేదు. హీరోయిన్గా గుర్తింపు దక్కకపోవడంతో రుద్రాంగి, గాండీవ దారి అర్జున వంటి ఇటీవల సినిమాల్లో కీలక పాత్రలలో కూడా కనిపించింది. కానీ అవి కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఆమె తాజాగా ఒకప్పటి హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వినయ్ రాయ్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు బయటపెట్టింది. నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలాకాలం నుంచి షికారులు చేస్తూనే ఉన్నాయి.

Chandrababu: వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్.. తప్పుడు రాజకీయం అంటూ బాబు ఘాటు వ్యాఖ్యలు!

అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. ఇక ఈ ఇద్దరూ నిజానికి కలిసి చేసిన ఫోటోషూట్ ని తమ తమ సోషల్ మీడియా వేదికలుగా షేర్ చేశారు. ఇక ఎలా అయితే పెళ్లి అయిన జంటలు ఫోటోషూట్ చేస్తారో వీరిద్దరూ కలిసి ఫోటోషూట్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. సో, ఈ ఫోటోషూట్‌తో, వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారని అంటున్నారు. ఇక తెలుగులో విమలా రామన్ “గాయం 2,” “ఎవరైనా ఎప్పుడైనా,” మరియు “చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి” సహా అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. వరుణ్ తేజ్ చిత్రం “గాండీవధారి అర్జున”లో వినయ్ రాయ్ మరియు విమలా రామన్ భార్యాభర్తలుగా నటించగా ఇప్పుడు లివిన్ లో ఉంటున్నట్టు వెల్లడించారు.

Exit mobile version