వందకోట్ల ఓటిటి ఆఫర్ ను వదులుకున్న ‘విక్రాంత్ రోనా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా ఓటిటికి మంచి ఆదరణ పెరిగింది. దీంతో భారీ సినిమాలకు కూడా ఓటిటిలో సినిమాలను డైరెక్ట్ గా విడుదల చేయడానికి కోట్లలో ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చాలామంది మేకర్స్ ఈ ఆఫర్లను తిరస్కరిస్తూ తమ సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు శాండల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్ కూడా ఓ భారీ ఆఫర్ కు నో చెప్పాడట. కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోనా’ 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. అనుప్ భండారి రూపొందించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ప్రకటించినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. పాన్ ఇండియా 3డి చిత్రం టైటిల్ ను బుర్జ్ ఖలీఫాపై గ్రాండ్ గా లాంచ్ చేయడం నుంచి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడం వరకు “విక్రాంత్ రోనా” ముఖ్యాంశాల్లో నిలిచారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘విక్రాంత్ రోనా’ నిర్మాతలు 100 కోట్ల భారీ ఆఫర్‌ను తిరస్కరించారు.
Read Also : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
మీడియా ఇంటరాక్షన్ లో నిర్మాత జాక్ మంజునాథ్ వద్ద ఈ విషయాన్నీ ప్రస్తావించగా… ఆయన మాట్లాడుతూ ‘అవును ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే. కానీ విక్రాంత్ రోనాను బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. నేను వ్యక్తిగతంగా చూసిన విజువల్స్ పెద్ద స్క్రీన్‌పై కుటుంబాలు, పిల్లలను థ్రిల్ చేసేలా ఉన్నాయి. 3డి అనుభవం అనేది ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునే అంశం. దేశంలోనే అతి పెద్ద స్క్రీన్‌లకు అర్హమైన సినిమా ఇది. ప్రేక్షకులకు సినిమా ఖచ్చితంగా మంచి అనుభూతిని ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
కిచ్చా సుదీప్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ నటించిన ‘విక్రాంత్ రోనా’ను జీ స్టూడియోస్ సమర్పణలో, జాక్ మంజునాథ్ తన ప్రొడక్షన్‌లో షాలిని ఆర్ట్స్‌పై, అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా నిర్మించారు. ఈ చిత్రం 2022 ఫిబ్రవరి 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!