చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. అస్సలు విడుదల అవుతుందా..? లేదా అని అభిమానుల్లో ఆందోళన తీసుకొచ్చిన సినిమా ఎట్టకేలకు విడుదల తేదిని ఖరారు చేసుకోంది. స్టార్ హీరో విక్రమ్, ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ మల్టీస్టారర్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహాన్’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఒకానొక సమయంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానం ఫ్యాన్స్ లో వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన థియేటర్లన్నీ మూసేస్తున్నసమయంలో ఈ సినిమా ఓటిటీ బాట పట్టింది. ఈ విషయాన్ని మేకర్ అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం డిజిటల్‌గా రానున్నట్లు ప్రకటించింది. తండ్రి కొడుకులిద్దరూ ఈ సినిమాలో పోటాపోటీగా నటించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్ సరసన సిమ్రాన్ బగ్గా నటిస్తుండగా.. ధృవ్ విక్రమ్ సరసన వాణీ భోజన్ నటిస్తోంది. మరి ఈ సినిమా విక్రమ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి
