NTV Telugu Site icon

Vikram: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరో విక్రమ్.. మరీ ఇంత దారుణంగానా

Siddu

Siddu

Vikram: హీరోలు.. కష్టపడకుండా కోట్లు తీసుకుంటున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, వాళ్లు పడే కష్టం ఇంకెవరు పడరు అని చెప్పొచ్చు. ఒక పాత్రకు ఎలా ఉండాలో డైరెక్టర్ చెప్పడం ఆలస్యం.. దాన్ని చేయడానికి రెడీ అయిపోతారు. లావు పెరగాలి, సన్నబడాలి.. హెయిర్ పెంచాలి.. స్పోర్ట్స్ నేర్చుకోవాలి.. బయోపిక్ ఐతే రీసెర్చ్ చేయాలి.. ఇలా ఒకటి అని చెప్పలేం. కథలో పాత్ర ఎలాంటిది అయినా ఆడియెన్స్ ను మాత్రం ఎంటర్ టైన్ చేయడమే పనిగా పెట్టుకున్నవారే హీరోలు. ఇక పాత్రలు అయినా.. ప్రయోగాలు అయినా.. కథ ఏదైనా.. క్యారెక్టర్ ఎంత రిస్క్ అయినా నేను ఉంటాను అని అంటాడు హీరో విక్రమ్. కోలీవుడ్ స్టార్ హీరో అవ్వకముందే విక్రమ్ తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసి మెప్పించాడు. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్.. తాజాగా తంగలాన్ చిత్రంలో నటిస్తున్నాడు.

Lavanya Tripathi: మెగా కోడలకు అరుదైన వ్యాధి..

పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్‌ కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్రమ్ సరసన మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు నటిస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఈ చిత్రంలో విక్రమ్ కు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. దీంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన విక్రమ్ .. తాజాగా షూటింగ్ లో పాల్గున్నాడు. ఈ విషయాన్నీ మేకర్స్ ఒక వీడియో ద్వారా తెలిపారు. విక్రమ్ షూటింగ్ సెట్ లో పాల్గొన్న వీడియోను షేర్ చేస్తూ షూటింగ్ మొదలైంది అని తెలిపారు. ఇక ఈ సినిమాలో విక్రమ్ ను అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం అంటే నమ్మండి. బక్కచిక్కి పోయి.. పలుచటి శరీరం.. పొడవైన జుట్టు.. చిన్న క్లాత్ కట్టుకొని చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు. ఎంత స్టైలిష్ గా ఉండే హీరోను.. ఎలా మార్చేశారు అయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments