Site icon NTV Telugu

Thangalaan: పుష్ప మిస్సయిన డేట్ కి వస్తున్న స్టార్ హీరో మూవీ

Taanglaan

Taanglaan

Thangalaan Release: చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపైన అంచనాలు పెంచేశాయి. విక్రమ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్న తంగలాన్ రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Kalki 2898 AD: ఫేక్ కలెక్షన్స్ .. ఇద్దరు ట్రేడ్ అనలిస్టులకు లీగల్ నోటీసులు!

ఇప్పటికే కొన్నిసార్లు రిలీజ్ డేట్ వెల్లడించి మళ్లీ వాయిదా వేశారు. చివరికి ఆగస్ట్ 15న మూవీ థియేటర్లలోకి రాబోతోంది. అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ సినిమా పోస్టుపోన్ కావడంతో చాలా చిన్న సినిమాలు ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యేందు రెడీ అయ్యాయి. ఇప్పుడు విక్రమ్ సినిమా కూడా ఆగష్టు లో రిలీజ్ కానున్నట్లు ఇదివరకు మేకర్స్ తెలిపారు. ఇంక అదే రోజు రిలీజ్ కాబోతుంది అంటు ఇవాళ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సారి అయిన అనుకున్న డేట్ కి వస్తుందో లేకపోతే మల్లి పోస్ట్ పోనే అవుతుందేమో అనేది చుడాలిసిందే. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version