విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్.. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసనే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు విజయ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హీరో సూర్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రేపు విడుదల కానున్న విషయం విదితమే.. తాజాగా ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది.. ఆ రివ్యూ ఇచ్చింది కూడా మరెవ్వరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు వ్యాప్తంగా చిత్రాన్ని ఉదయ్ నిధిస్టాలిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల ఆయన కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేశారట చిత్ర బృందం.. సినిమా చూసిన ఉదయ్.. విక్రమ్ పై పొగడ్తల వర్షాన్ని కురిపించాడు.
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, కమల్ నటనకు ఫిదా అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. లోకేష్ టేకింగ్ బావుందని, మిగతా హీరోలందరూ కూడా బాగా చేసినట్లు తెలిపారు. ఇక ఈ ఒక్క రివ్యూ తో రేపు రిలీజ్ కాబోతున్న విక్రమ్ పై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. అయితే కమల్ కు ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని కమల్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగులో యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నాడు. మరి విక్రమ్ రిజల్డ్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే..
