NTV Telugu Site icon

Vijay: మిచౌంగ్ తుఫాన్.. వారిని సహాయం చేయమని కోరిన దళపతి విజయ్

Vijay

Vijay

Vijay: చెన్నై వరదల్లో చిక్కుకుంది. మిచౌంగ్ దెబ్బకు.. చెన్నై మొత్తం నీట మునిగింది. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనివలన ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. తిండి లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా .. ఇంకా పలు గ్రామాల్లో ఎంతోమంది ఆకలికి అలమటిస్తున్నారు. రెస్క్యూ వర్కర్లు నడుము లోతు నీటిలో తిరుగుతున్న వీడియోలు, నీటిలో మునిగిన వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైమానిక దళం హెలికాప్టర్లు కూడా వరదలతో ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, రేషన్‌లను అందిస్తున్నాయి. ఇక ఇలాంటి వరదలు వచ్చిన ప్రతిసారి.. సెలబ్రిటీలు తమవంతు సాయం చేయడానికి ఎప్పుడు ముందు ఉంటారు. ఇప్పటికే సూర్య, కార్తీ.. ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేశారు. వీరితో పాటు చాలామంది ట్విట్టర్ వేదికగా.. తమ సానుభూతిని తెలుపుతున్నారు. తాజాగా దళపతి విజయ్.. మిచౌంగ్ తుఫాన్ పై ట్వీట్ చేశాడు. ప్రభుత్వానికి సాయం చేయడానికి వలంటీరులుగా రావాలని తమ ఫ్యాన్స్ ను సాయం కోరాడు.

“చెన్నై మరియు దాని శివార్లలో “మిచౌంగ్” ​​తుఫాను భారీ వర్షాల కారణంగా, పిల్లలు, మహిళలు మరియు వృద్ధులతో సహా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, ఆహారం, కనీస వసతులు లేక వేలాది మంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నట్లు సమాచారం. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతూ సోషల్ మీడియాలో ఇంకా అనేక స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ సమయంలో, బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో ప్రజా ఉద్యమ నిర్వాహకులందరూ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.