తమిళ స్టార్ హీరో విజయ్ కు తమిళనాడులో క్రేజ్ ఎటువంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.
Also Read : Prabhas : రాజాసాబ్ టీజర్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న జననాయగాన్ ఫస్ట్ గ్లిమ్స్ ను ఈ నెల 21న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇందుకు సంబందించి అధికారిక ప్రకటన ఈ నెల 19న వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోని పూజా హెగ్డే కు సంబంధించి షూట్ ను ఫినిష్ చేసాడు డైరెక్టర్ వినోద్. ఇక మిగిలిన షూట్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న జననాయగన్ రిలీజ్ తర్వాత ఎంతటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
