SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో అందుకొని బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా SSMB29. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందజేస్తున్న విషయం తెల్సిందే. స్టోరీ విషయంలో తల్లిదండ్రులిద్దరు ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్నారు. ఇద్దరి ఐడియాల్ని,విజువలైజేషన్ చేసుకుని సిద్దం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక నిన్ననే మహేష్ బాబు.. ఈ సినిమా కోసమే జర్మనీలో జరిగే వర్క్ షాప్ కు అటెండ్ అయ్యాడని టాక్ వినిపించింది.
తాజాగా ఈ సినిమా గురించిన ఒక అప్డేట్ ను విజయేంద్రప్రసాద్ అందించాడు. ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో SSMB29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా ఈ స్టోరీపైనే తండ్రీకొడుకులు కూర్చొని యుద్ధం చేస్తున్నారు. ఇక ఇది పూర్తి అయ్యింది అంటే మిగతావి అన్ని లైన్ గా జరిగిపోయినట్లే. స్టోరీ తరువాత నటీనటుల సెలక్షన్.. ఆ తరువాత వెంటనే సెట్స్ మీదకు వెళ్లిపోవడమే. ఏదిఏమైనా విజయేంద్ర ప్రసాద్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలిపాడు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
