Vijayasanti : విజయశాంతి నటించిన లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయశాంతి అనేక విషయాలను పంచుకున్నారు. నేను చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా తల్లి, కొడుకుల బంధాన్ని చూపిస్తుంది. ఇందులో యాక్షన్ సీన్లు చేయడాన్ని ఒక సవాల్ గా తీసుకున్నాను. ఏడాది నుంచి దాని కోసం స్పెషల్ డైట్ ఫాలో అయ్యాను. చాలా వర్కౌట్లు కూడా చేశాను. అందుకే యాక్షన్ సీన్లు అంత సహజంగా వచ్చాయి. నేను ఇండస్ట్రీలో చిన్న స్థాయి నుంచే వచ్చాను. ఇప్పుడు ఎంతో మంది దీనిపై ఆధారపడి ఉన్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని సినిమాను చంపేయొద్దు అన్నాను.
Read Also: Anupama : అనుపమని పక్కన్న పెడుతున్న టాలీవుడ్..
సినిమా ఇండస్ట్రీ బాగుంటే పది మందికి పని దొరుకుతుంది. అందుకే నెగెటివ్ రివ్యూలపై అలా మాట్లాడాను. హీరోయిన్లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు తనకంటే చిన్న వయసు హీరోయిన్లను కూడా మీరు అంటూ పలకరించేవారు. ఆయనను చూసే గౌరవం ఇవ్వాలని నేర్చుకున్నాను. అందరికీ సమాన గౌరవం దక్కినప్పుడే బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా కష్టపడుతారు. కానీ సినిమా క్రెడిట్ లో ఎంతో కొంత హీరోయిన్లకు ఇస్తే బాగుంటుంది. ఇప్పటికీ హీరోయిన్ల విషయంలో కొంత తక్కువ గౌరవమే ఇస్తున్నారు. ఇది మారితే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది విజయశాంతి.
