Site icon NTV Telugu

Vijayasanti : రాములమ్మ పవర్.. ఇండస్ట్రీలో ఒకటే రచ్చ..

Vijayashanthi

Vijayashanthi

Vijayasanti : విజయశాంతి చేసిన ఒక్క కామెంట్ ఇండస్ట్రీలో రచ్చ లేపింది. పెద్ద హీరోలను, డైరెక్టర్లు, నిర్మాతలను కదిలిస్తోంది. అందరూ ఒకటే విషయంపై చర్చ జరుపుతున్నారు. ఇంతకీ రాములమ్మ దేనిమీద ఇంత పెద్ద రచ్చ లేపిందో తెలుసా.. అదే నెగెటివ్ రివ్యూల మీద. ఈ నెగెటివ్ రివ్యూల మీద గతంలో చాలా మంది మాట్లాడినా.. ఇంత రచ్చకు దారి తీయలేదు. అది వారి అభిప్రాయం అన్నట్టే ఇండస్ట్రీ మౌనంగా ఉండిపోయింది. సన్నాఫ్‌ వైజయంతి సక్సెస్ మీట్ లో విజయశాంతి మాట్లాడుతూ.. మంచి సినిమాను నెగెటివ్ రివ్యూలతో చంపేయకండి అంటూ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ఇండస్ట్రీని కదిలించాయి. నెగెటివ్ రివ్యూలు, ట్రోల్స్ తో కావాలని విషం చిమ్ముతున్నారు అంటూ విజయశాంతి చేసిన కామెంట్స్ హీరోలను కూడా స్పందించేలా చేస్తోంది.
Read Also: The Raja Saab : ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటా..

దెబ్బకు సినీ పెద్దలు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నెగెటివ్ రివ్యూలు ఇవ్వకుండా బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు చేసే పరిస్థితులు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై టాలీవుడ్ బడా నిర్మాతలు, గిల్డ్ సభ్యుల మీటింగ్ ఊడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. నెగెటివ్ రివ్యూల మీద ఇప్పటికే నాని, ప్రియదర్శి లాంటి హీరోలు కూడా స్పందించారు. తమ వాదన వినిపించారు. రిలీజ్ అయిన మొదటి రోజే సినిమాను నెగెటివ్ రివ్యూలతో చంపేయడం కరెక్ట్ కాదంటూ చెబుతున్నారు. డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. మొత్తంగా రాములమ్మ చేసిన ఒక్క కామెంట్ ఇండస్ట్రీనే నిద్ర లేపింది. ఈ దెబ్బతో రాములమ్మ పవర్ ఇది అంటూ ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Exit mobile version