NTV Telugu Site icon

Vijayakanth: మార్కెట్ కోసం ఇతర భాషల్లో సినిమాలు చేయని ఏకైక తమిళ స్టార్

Vijayakanth Hero

Vijayakanth Hero

విజయ్ కాంత్… కోలీవుడ్ హీరో అయినా తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యారు. హీరోగానే కాకుండా… దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. ఓ భాషలో స్టార్ ఇమేజ్ వచ్చాక… ఇతర భాషలలో కూడా మార్కెట్ సంపాదించుకోవాలి అనుకుంటారు. అందుకోసం..అక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేస్తారు కాని… కెప్టెన్ విజయ్ కాంత్ మాత్రం సొంత భాషను వదిలి పెట్టలేదు. కోలీవుడ్లో తప్ప మరో లాంగ్వెజ్లో మూవీ చేయలేదు. విజయ్ కాంత్ తమిళ్ సినిమాలలోనే నటించాడు. అయితే… ఈయన సినిమాలు తెలుగు, హిందీ లాంగ్వెజస్ లో కూడా డబ్బింగ్ అయ్యాయి. టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా విజయకాంత్ డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక్కడ ఆయన నటించిన సినిమాలు మంచి విజయం సాధించాయి. 90’ల కాలంలో డైరెక్ట్ తెలుగు సినిమాలతో పోటీ పడ్డాయి.

పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విజయకాంత్… ఖాకీ డ్రెస్సుకి వెండితెర మీద విలువ తీసుకొచ్చాడు. కనిపించని మూడో సింహాంగా… సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించాడు. తన సినీ కెరీర్లో దాదాపుగా 20కి పైగా పోలీస్ చిత్రాలలో నటించాడు విజయ్ కాంత్. ఈ సినిమాలలో ఎక్కువగా విజయం సాధించినవే ఉన్నాయి. విజయ్ కాంత్ నటించిన సినిమాలు ఎన్నో కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటునే మాస్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. కోలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద తన తోటి స్టార్ హీరోలతో పోటాపోటీగా కనిపించాడు. తనకుంటూ… మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయకాంత్. కె.ఎన్.అలగర్స్వామి, ఆండాళ్ అజగర్ స్వామి దంపతులకు 1952 ఆగస్ట్ 25న మధురైలో జన్మించాడు. విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. కాలేజ్ రోజుల్లో… ఓ నాటకంలో వేశం కట్టాడు.

ఆ తర్వాత యాక్టింగ్ మీద… విజయకాంత్ కి ఇంట్రస్ట్ పెరిగింది. విజయ్ కాంత్ మొదటి చిత్రం… ఇనిక్కుం ఇలామై. ఈ మూవీలో నెగిటివ్ రోల్లో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత అగల్ విలక్కు, నీరోట్టం, సమంతిప్పూ లాంటి సినిమాలలో నటించాడు. అయితే ఈ సినిమాలు అనుకున్న విజయాలు సాధించలేదు. కెరీర్ మొదట్లో విజయాలు రాకపోయిన..ఓ సారి సక్సెస్ చూసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు…విజయకాంత్. కె విజయన్ దర్శకత్వంలో వచ్చిన దూరతు ఇది ముజక్కామ్ మూవీ… మత్సకారుల నేపథ్యం స్టోరీతో తెరకక్కింది. ఈ మూవీ దర్శకుడు విజయన్… హీరోకి విజయకాంత్ గా పేరు మార్చాడు. విజయకాంత్… దూరతు ఇది ముజక్కామ్ మూవీ తర్వాత..ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో సత్తమ్ ఓరు ఇరుట్టరయ్ మూవీలో కథానాయకుడిగా కనిపించాడు..విజయ్ కాంత్. ఈ మూవీ కూడా కమర్శియల్ గా విజయం సాధించింది. విజయకాంత్ మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది. ఇదే సినిమా తెలుగులో చట్టానికి కళ్లు లేవు టైటిల్ తో రీమేక్ అయింది.