NTV Telugu Site icon

Vijayakanth: కెప్టెన్ విజయకాంత్ చనిపోలేదు.. భార్య ప్రేమలత క్లారిటీ

Vijay

Vijay

Vijayakanth: కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై ఉదయం నుంచి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆయన అనారోగ్యం క్షీణించడంతో నవంబర్ 18 న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ మధ్య గొంతు నొప్పి, జలుబు తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం. అయితే.. సాధారణ పరీక్షలు అని మాత్రమే అని డీఎండీకే నేతలు చెప్పినా కూడా దాదాపు 10 రోజుల నుంచి ఆయన హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఉదయం నుంచి కూడా విజయకాంత్ ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఉదయం విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసారు. అందులో .. “విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారు.. కానీ గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నాం. విజయకాంత్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని” వైద్యులు తెలిపారు.

Gaami: అర్ధంకాని రోగంతో బాధపడుతున్నా.. విశ్వక్ డైలాగ్ వైరల్

ఇక కొద్దిసేపటి నుంచి విజయకాంత్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు ఊపు అందుకున్నాయి. దీంతో ఈ వార్తలపై విజయకాంత్ భార్య ప్రేమలత విజయకాంత్ క్లారిటీ ఇచ్చారు. ” కెప్టెన్ విజయ్ బావున్నారు. ఆయన చనిపోలేదు. రూమర్స్ ను నమ్మకండి. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన పూర్తీ ఆరోగ్యంతో కోలుకొని త్వరలోనే ఇంటికి వస్తారు. అప్పటివరకు ఇలాంటి వార్తలను నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో విజయకాంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

Show comments