Kalki 2898 AD: ఇప్పుడే సినిమా చూడటం జరిగింది.. వెయ్యి కోట్లు పక్కా అంటున్న స్టార్స్‌

  • ట్విట్టర్ వేదికగా కల్కి సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నా విజయ దేవరకొండ
  • ఇది అసలు నమ్మశక్యంకానిది అంటున్న రష్మిక మందన్న
  • ఓహ్ మై ఫ్రీకింగ్ గాడ్ నాగశ్విన్ మీరు ఒక అందమైన మేధావి
Vr

Vr

Vijaya Devara Konda & Rashmika Mandanna On Kalki AD 2898: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన సినిమా “కల్కి 2898 ఏడి” డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా వసూళ్లు సునామి సృష్టిస్తుంది. రిలీజ్ అయిన రెండు రోజులోనే ఏకంగా 298. కోట్లు కలెక్ట్ చేసింది. ఇవాళ రేపు వీకెండ్ కావడంతో 500కోట్లు మార్కుని రీచ్ అవుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మూవీ పైన ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్స్, హీరోలు దగ్గర నుంచి మంచి స్పందన లభిస్తుంది. క్రిటిక్స్ కూడా సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:  Kalki 2898 AD Two days Collections: బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రకంపనలు సృష్టిస్తున్న కల్కి..

అయితే ఈ సినిమాలో అర్జునుడుగా ప్రత్యక్షమైన విజయ దేవరకొండ తాజాగా ట్విట్టర్ వేదికగా కల్కి సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇప్పుడే కల్కి సినిమా చూశా.. మాటలు రావడం లేదు. ఇండియన్‌ సినిమాలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ చిత్రం వెయ్యి కోట్ల పైనే రాబడుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్‌ దేవరకొండ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. అలానే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా సినిమా పైన ప్రశంసల వర్షం కురిపించింది. “ఓహ్ మై ఫ్రీకింగ్ గాడ్ నాగశ్విన్ మీరు ఒక అందమైన మేధావి ఇది అసలు నమ్మశక్యంకానిది. మన పౌరాణిక దేవుళ్లు మన తెరపై సజీవంగా రావడాన్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన కల్కి టీం అందరికి అభినందనలు ఈ చిత్రం అందరి ప్రేమకు మరియు మరిన్నింటికి అర్హమైనదిగా భావిస్తున్న” అంటు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.