Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా కథ నచ్చితే విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కూడా నటిస్తూ నటుడిగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే విజయ్ సేతుపతి చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో బాలీవుడ్ మెర్రీ క్రిస్టమస్ ఒకటి. వచ్చే ఏడాది అది రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇంకొన్ని తమిళ్ ప్రాజెక్ట్స్ షూటింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తికాకముందే విజయ్ సేతుపతి మరో కొత్త సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ లో థ్రిల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన డైరెక్టర్ మిస్కిన్. ఆయన దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ది వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Ranbir Kapoor: యానిమల్ సినిమాలో నేను చాలా తప్పులు చేశా..
ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైన్ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఈ పోస్టర్ ను డైరెక్టర్ మిస్కిన్ షేర్ చేస్తూ.. ప్రయాణం మొదలైంది అని రాజుకొచ్చాడు. పోస్టర్ లో విజయ్ సేతుపతి లుక్ ఆకట్టుకుంటుంది. ఇక పేరుకు తగ్గట్టే ట్రైన్.. పట్టాలను చూపించారు. పోస్టర్ ను బట్టి ఇది కూడా థ్రిల్లర్ కథలానే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ఫౌజియా ఫాతిమా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరి ఈ సినిమాతో విజయ్ సేతుపతి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
