Site icon NTV Telugu

Merry Christmas: డిసెంబర్ 25న ‘మెర్రి క్రిస్మస్’ రావట్లేదు…

Meeru Christmas

Meeru Christmas

అదేంటి మరి కొన్ని గంటల్లో క్రిస్మస్ పండగమని చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంతా సిద్ధమవుతుంటే, ఇప్పుడు క్రిస్మస్ రావట్లేదు అంటున్నారు అని కంగారు పడకండి. ఈ హెడ్డింగ్ రేపు అందరూ జరుపుకోనున్న క్రిస్మస్ పండగ గురించి కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రి క్రిస్మస్’ సినిమా గురించి… 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023లో ‘మెర్రి క్రిస్మస్’ సినిమాని విడుదల చెయ్యనున్నారు, ఫైనల్ డేట్ ని లాక్ చెయ్యలేదు కానీ దాదాపు ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: Trisha: డీ-ఏజింగ్ టెక్నాలజీ కూడా ఇంత అందం ఇవ్వలేదు…

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని శ్రీరామ్ రాఘవన్ రూపొందిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో శ్రీరామ్ రాఘవన్ దిట్ట, ఆయన డైరెక్ట్ చేసిన ‘అంధాదున్’ సినిమా నేషనల్ అవార్డ్ అందుకుంది. శ్రీరామ్ రాఘవన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే ఎదో కొత్త కథని చూడబోతున్నాం అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూనే ‘మెర్రి క్రిస్మస్’ పోస్టర్ లో కూడా వైన్ గ్లాసుల్లో రక్తాన్ని నింపి షాక్ ఇచ్చాడు శ్రీరామ్ రాఘవన్. మరి హిందీ తమిళ భాషల్లో 2023లో రిలీజ్ కానున్న ఈ మూవీ ఆడియన్స్ ని ఎంత థ్రిల్ చేస్తుందో చూడాలి.

Read Also: Vijay Setupathi: విక్రమ్ విలన్.. దేవుడా ఇలా మారిపోయాడేంటి..?

Exit mobile version