NTV Telugu Site icon

Vijay Setupathi: ‘ఉప్పెన’ విలన్ అసలు కూతురును చూశారా.. ?

Vijay

Vijay

Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ అనే కాదు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా విజయ్ సేతుపతి గురించి చెప్పుకొస్తారు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్ లో ఆయన నటన అద్భుతమని చెప్పాలి. తెలుగులో ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఈ సినిమాలో బేబమ్మ తండ్రిగా.. ఊరి పెద్దగా.. ప్రేమ పెళ్లిని ఇష్టపడని తండ్రిగా విజయ్ సేతుపతి నటనకు ఫిదా కాని వారు ఉండరు. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క విలన్ గా నటిస్తూ బిజీగా మారాడు. సినిమాల గురించి పక్కన పెడితే తాజాగా ఆయన కుటుంబానికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిన్న ఓనమ్ పండుగ సందర్భంగా విజయ్ సేతుపతి తన పిల్లలతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

Priyanka Mohan: కెప్టెన్ మిల్లర్ అయ్యింది.. ఇక OG లో అడుగుపెట్టు పాప

కొద్దోగొప్పో విజయ్ సేతుపతి కొడుకు సూర్య గురించి చాలామందికి తెలుసు. కొన్ని సినిమాల్లో సూర్య చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇక విజయ్ కూతురు శ్రీజ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఆయనకు ఒక కూతురు ఉందా అన్న విషయం కూడా చాలామందికి తెలియదు అనే చెప్పాలి. కానీ నిజం ఏంటంటే ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది. దీంతో ఆమెను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ముగిల్ అనే సినిమాలో శ్రీజ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా విజయ్ సేతుపతి, శ్రీజ తండ్రి కూతుర్లుగా నటించారు అందులో ఉన్న ఆమె విజయ్ కూతురా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె చదువు మీద ఫోకస్ పెట్టిందట.. చదువు తరువాత ఆమె ఏది కావాలంటే అది చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. మరి శ్రీజ హీరోయిన్ అవుతుందా.. ? లేదా అనేది చూడాలి.