Site icon NTV Telugu

Viduthalai: కొడైకెనాల్ లో ఎవరూ గుర్తుపట్టని స్థితిలో విజయ్ సేతుపతి!?

Vijay Sethupathi11

Vijay Sethupathi11

తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘విడుతలై’. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సూరి నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.ఏస్ ఇన్ఫోటైన్మెంట్, రెడ్ జయింట్ మూవీస్ పతాకం పై ఎల్డ్రడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఉత్కంఠభరిత సన్నివేశాలు కొడైకెనాల్ లోని పూంబరై లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ఇతర ఫైటర్స్ కనిపించనుండగా పీటర్ హెయిన్ భారీ స్థాయిలో యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. బల్గేరియా నుండి వచ్చిన కెమెరా సిబ్బంది దీన్ని ఉన్నత స్థాయిలో కాప్చర్ చేస్తున్నారు. భిన్నమైన గెటప్స్ వేయడంలో దిట్ట అయిన విజయ్ సేతుపతి ఇందులోనూ అదే శైలిలో ఎవరూ గుర్తించలేని విధంగా మేకోవర్ చేశారు. తమిళ చిత్రసీమలో భారీ బడ్జెట్ చిత్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా తెరకెక్కుతున్న ‘విడుతలై’పై ఆరంభం నుండే చక్కని అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నటులు, ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు ఇందులో భాగమవ్వటంతో పాటు ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన రావడంతో ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

విజయ్ సేతుపతి, సూరితో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. మేస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చుతుండగా, వేల్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version