New York India Day Parade : న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో మెరిసిన టాలీవుడ్ స్టార్ జంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన గర్వకారణం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వేళ, దేశమంతా పతాకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి వాతావరణం నెలకొంటుంది. అయితే, కేవలం భారతదేశంలోనే కాదు.. అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా మన జాతీయ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది న్యూయార్క్‌లో నిర్వహించే ఇండియా డే పరేడ్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుక, విదేశాల్లో నివసించే భారతీయుల ఐక్యతను, దేశభక్తిని ప్రతిబింబించే అద్భుత వేదికగా నిలుస్తోంది. ఈసారి 43వ ఇండియా డే పరేడ్ మరింత ప్రత్యేకంగా జరిగింది.
Also Read : AA22xA6 : అల్లు అర్జున్–అట్లీ మూవీలోకి సీనియర్ హీరోయిన్ ఎంట్రీ..!
Also Read
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ఎందుకంటే, ఈ వేడుకలో టాలీవుడ్ లవ్లీ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్గా పాల్గొని, భారతీయ సంస్కృతిని ప్రతినిధిగా ప్రదర్శించారు. వేలాది మంది భారతీయ అమెరికన్లతో పాటు వివిధ దేశాల ప్రజలు హాజరైన ఈ వేడుకలో, ఈ స్టార్ జంట మెరిసిపోవడం అభిమానులకు పండగలా మారింది. వారి ఎంట్రీ తో పాటు స్టేజ్ పై జాతీయ గీతం ప్రతిధ్వనించిన క్షణాలు ప్రతి ఒక్కరిని దేశభక్తి వాతావరణంలో ముంచెత్తాయి. భారత్ వెలుపల జరుగుతున్న అతిపెద్ద ఇండియన్ పరేడ్ అయిన ఈ వేడుక, ప్రతి ఒక్క భారతీయుడిలో గర్వ భావాన్ని కలిగించింది. ఇక సోషల్ మీడియాలో అయితే రష్మిక–విజయ్ జంట ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై మెరిపించడం అభిమానుల్లో విశేష చర్చనీయాంశమైంది. అంతేకాకుండా షూటింగ్స్ ఆగిపోవడంతో, ఈ వేడుక తర్వాత ఇద్దరూ కలిసి వెకేషన్‌కి వెళ్లబోతున్నారని బజ్ క్రియేట్ అవుతోంది.
తాజావార్తలు
-
Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!