Site icon NTV Telugu

New York India Day Parade : న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో మెరిసిన టాలీవుడ్ స్టార్ జంట

Vijay & Rashmika Shine At New York India Day Parade

Vijay & Rashmika Shine At New York India Day Parade

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన గర్వకారణం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వేళ, దేశమంతా పతాకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి వాతావరణం నెలకొంటుంది. అయితే, కేవలం భారతదేశంలోనే కాదు.. అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా మన జాతీయ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది న్యూయార్క్‌లో నిర్వహించే ఇండియా డే పరేడ్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుక, విదేశాల్లో నివసించే భారతీయుల ఐక్యతను, దేశభక్తిని ప్రతిబింబించే అద్భుత వేదికగా నిలుస్తోంది. ఈసారి 43వ ఇండియా డే పరేడ్ మరింత ప్రత్యేకంగా జరిగింది.

Also Read : AA22xA6 : అల్లు అర్జున్–అట్లీ మూవీలోకి సీనియర్ హీరోయిన్ ఎంట్రీ..!

ఎందుకంటే, ఈ వేడుకలో టాలీవుడ్ లవ్లీ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్‌గా పాల్గొని, భారతీయ సంస్కృతిని ప్రతినిధిగా ప్రదర్శించారు. వేలాది మంది భారతీయ అమెరికన్లతో పాటు వివిధ దేశాల ప్రజలు హాజరైన ఈ వేడుకలో, ఈ స్టార్ జంట మెరిసిపోవడం అభిమానులకు పండగలా మారింది. వారి ఎంట్రీ తో పాటు స్టేజ్ పై జాతీయ గీతం ప్రతిధ్వనించిన క్షణాలు ప్రతి ఒక్కరిని దేశభక్తి వాతావరణంలో ముంచెత్తాయి. భారత్ వెలుపల జరుగుతున్న అతిపెద్ద ఇండియన్ పరేడ్ అయిన ఈ వేడుక, ప్రతి ఒక్క భారతీయుడిలో గర్వ భావాన్ని కలిగించింది. ఇక సోషల్ మీడియాలో అయితే రష్మిక–విజయ్ జంట ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై మెరిపించడం అభిమానుల్లో విశేష చర్చనీయాంశమైంది. అంతేకాకుండా షూటింగ్స్ ఆగిపోవడంతో, ఈ వేడుక తర్వాత ఇద్దరూ కలిసి వెకేషన్‌కి వెళ్లబోతున్నారని బజ్ క్రియేట్ అవుతోంది.

Exit mobile version