Site icon NTV Telugu

కొత్తఏడాది తమ ప్రేమను ప్రకటించనున్న విజయ్- రష్మిక జంట..?

vijay-rashmika

vijay-rashmika

గీత గోవిందం చిత్రంతో పాపులర్ జంటగా మారిపోయారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. ఈ సినిమాతో రష్మిక టాలీవుడ్ కి పరిచయం కాగా, విజయ్ కి క్లాస్ హీరోగా పేరు వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. అప్పటినుంచే ఈ జంట మధ్య ప్రేమ చిగురించిందని పుకార్లు గుప్పుమంటున్నాయి. వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ లవ్ బర్డ్స్ డిన్నర్లు, డేట్లు అంటూ కెమెరా కంటపడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుస.

ఇక ఈ కొత్త ఏడాది ఈ జంట ఒక కీలక ప్రకటన చేయనున్నారట. ఆ కీలక ప్రకటన వారి రిలేషన్ గురించే అయ్యి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. వారి ప్రేమను అధికారికంగా ప్రకటించనున్నారా..? లేక పెళ్లి గురించి ఏమైనా గుడ్ న్యూస్ చెప్పనున్నారా..? అని ఫ్యాన్స్ చర్చించుకొంటున్నారు. మరి రేపు ఈ జంట చెప్పబోయే ఆ కీలక విషయం ఏంటి అనేది తెలియాలి. ఇకపోతే రష్మికకు హీరో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్ మెంట్ జరిగి క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.

Exit mobile version