Site icon NTV Telugu

Vijay Setupathi: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ వదిలేసి మంచి పనే చేశాడు..?

Vijay

Vijay

Vijay Setupathi: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా అనుకున్నప్పటినుంచి తమిళనాడులో ఎలాంటి వివాదాలు మొదలయ్యయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముత్తయ్య శ్రీలంకకు చెందినవాడా.. ? తమిళనాడుకు చెందినవాడా..? అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అవన్నీ పక్కన పెడితే క్రికెట్ చరిత్రలోనే 800 వందల వికెట్లు తీసిన క్రికెటర్ గా ముత్తయ్య మురళీధరన్ పేరు.. ఎన్నేళ్లు వచ్చినా చెరగని ముద్రగా చెప్పుకొస్తారు. ఇక అతని జీవితంలో ప్రజలకు తెలియని ఎన్నో పేజీలు ఉన్నాయి. అందుకే అతని బయోపిక్ తీయాలని ఎం.ఎస్‌. శ్రీపతి ఎంతో ఆసక్తి కనపరిచాడు. ఇక ఈ బయోపిక్ కు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అయితే బావుంటుంది అనుకోని ఆయనను కలవడం.. విజయ్ ఒప్పుకోవడం జరిగింది. అదుగో అక్కడ మొదలయ్యింది గొడవ. శ్రీలంక ఆటగాడు అయినప్పటికీ మురళీధరన్‌కు తమిళ మూలాలున్నాయి. అయితే తమిళ ఉద్యమానికి సంబంధించిన విషయాల్లో మురళీధర న్‌ తమిళుల వైపు ఎప్పుడూ నిలబడలేదు.. అలాంటి వ్యక్తి బయోపిక్ లో ఒక తమిళ హీరో నటించడానికి వీల్లేదు అంటూ తమిళ తంబీలు రచ్చ చేశారు.

800 Trailer: గుండెల్ని మెలిపెట్టి వదిలేశారు.. గూజ్ బంప్స్ అంతే!

ఇక అవేమి పట్టించుకోని మేకర్స్.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఆ రోజు తమిళనాడు తగలబడిపోయింది. కేవలం అభిమానులే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు సైతం విజయ్ పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఈ బయోపిక్ కనుక చేస్తే విజయ్ సేతుపతిని బ్యాన్ చేస్తామని కూడా బెదిరించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ముత్తయ్య.. తన వల్ల ఒక నటుడి కెరీర్‌ నాశనం కావడం ఇష్టం లేదని, ఈ బయోపిక్ నుంచి విజయ్ తప్పుకోవాల్సిందిగా కోరాడు. దీంతో విజయ్.. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక హీరో మాత్రమే మారాడు.. బయోపిక్ ను ఎవరు ఆపలేకపోయారు. విజయ్ సేతుపతి ప్లేస్ లో మాధుర్‌ మిత్తల్‌ ను తీసుకున్నారు.

Kalki2898AD: కల్కికి తప్పని లీకుల బెడద.. ప్రభాస్ లుక్ లీక్

ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూశాక .. విజయ్ ఈ బయోపిక్ నుంచి బయటికి వచ్చి మంచి పనిచేశాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ట్రైలర్ లో ముత్తయ్య ఎదుర్కున్న అవమానాలు.. వాటి నుంచి అతను భయపడడం.. అసలు అతను తమిళీయుడా.. సింహళీయుడా.. ? అని తెలియకుండా విమర్శించడం.. ఇలా మొత్తాన్ని చూపించారు. ఒకవేళ అవన్నీ కాదని విజయ్ సేతుపతి చేసినా.. ఇప్పుడు వచ్చే విమర్శలను తట్టుకోవడం అతనివలన అయ్యేది కాదని అంటున్నారు. మరి ఈ సినిమాతో మాధుర్‌ మిత్తల్‌ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=iNp9cBWwcBE

Exit mobile version